కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో... ఆలయాన్ని, కళ్యాణవేదికను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు సిద్ధంచేశారు. ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాఅధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.