PRABALU: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభలతీర్థం మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామదేవతల ఆలయాల వద్ద కమిటీ సభ్యులు, యువకులు ప్రత్యేకంగా ప్రభలను తయారు చేసి, వివిధ రకాలుగా అలంకరించి డప్పు వాయిద్యాలు, బాణ సంచా కాల్పులతో ఊరేగింపుగా కొత్తపేటకు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో పెట్టిన ప్రభలను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాల్లోనూ జోరుగా ప్రభలు తయారుచేస్తున్నారు.
PRABALU: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రభల తీర్థాలు - Prabhala Tirthas in west godavari district
PRABALU: కనుమ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రభల తీర్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది. రుద్రులు కొలువైన కొబ్బరితోటల్లో తమ ఊరి నుంచి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే....సుఖసంతోషాలతో ఉంటాయనేది గోదావరి వాసుల నమ్మకం.
ఉభయగోదావరి జిల్లాల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రభల తీర్థాలు