ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

900 కిలోల గంజాయి పట్టివేత...ఒకరు అరెస్ట్ - police seize 900 kgs of marijuana smuggled in east godavri

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంతో పాటు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

marijuana seized
అక్రమంగా తరలిస్తున్న 900 కీలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

By

Published : Jan 12, 2021, 3:34 PM IST

విశాఖ జిల్లా మన్యం ప్రాంతం నుంచి తూర్పు గోదావరి జిల్లా తుని వైపు తరలిస్తున్న 900 కిలోల గంజాయిని కోటనందురు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి మండలం లోతుగడ్డ ప్రాంతం నుంచి 35 బస్తాల్లో గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. వ్యక్తిని అరెస్ట్ చేసి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details