కేంద్రపాలిత యానాంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీ సంస్థ సమకూర్చిన ప్లాస్టిక్ సీసాల క్రషింగ్ యంత్రాన్ని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంగా యానాంకు తూర్పుగోదావరి జిల్లాలో గుర్తింపు ఉన్నందున ప్రతిరోజూ వందలాది మంది యానాం వస్తున్న నేపథ్యంలో వారు ఉపయోగించిన మంచినీరు ఇతర శీతల పానీయాల ప్లాస్టిక్ సీసాలు రోజుకు వెయ్యిలోపు ఉంటున్నాయి. వాటిని సేకరించిన పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డులో పడేస్తున్నారు. వీటిని చిత్తుకాగితాలు ఇతర వస్తువులు సేకరించేవారు తిరిగి షాపులకు అమ్మకానికి తీసుకొస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరిగి ఉపయోగించే అవకాశం లేకుండా సీసాను ఈ యంత్రం చిన్న చిన్న ముక్కలుగా చేస్తోంది. ఈ యంత్రంలో వేసిన ఒక్కో సీసాకు పేటీఎమ్ ద్వారా ఐదు రూపాయలు ఖాతాలో జమ అయ్యేలా చేశారు. ఈ క్రషింగ్ అయిన ప్లాస్టిక్‌ను మరోసంస్థ కొనుగోలు చేసి పునరుత్పత్తి చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ప్లాస్టిక్ సీసాల రీసైక్లింగ్ యంత్రం ప్రారంభం - puducherry
కేంద్రపాలిత యానాంలో ప్రముఖ చమురు కంపెనీ ఓఎన్జీసీ ప్లాస్టిక్ క్రషింగ్ యంత్రాన్ని ప్రభుత్వానికి అందించింది. దీనిని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు.
యానాంలో ప్లస్టిక్ సీసాల రీసైక్లింగ్ యంత్రం వచ్చేసిందోచ్...