ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దూరం మరిచిన ప్రజలు... బ్యాంకుల వద్ద బారులు

కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఓ వైపు ముమ్మర చర్యలు తీసుకుంటుంటే.. ప్రజలకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. తూర్పు గోదావరి జిల్లా తుని వద్దనున్న ఎస్​బీఐ వద్ద.. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు బారులు తీరారు.

people  waiting in que at bank  without distance in thuni
తునిలో బ్యాంకుల వద్ద ప్రజల బారులు

By

Published : May 30, 2020, 2:52 PM IST

కరోనా భయాందోళనలకు గురిచేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని ఎస్​బీఐ వద్ద లావాదేవీల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. తుని పట్టణంలోని ప్రధాన రహదారిని కంటైన్​మెంట్ జోన్ నుంచి తొలగించి సడలింపులు ఇవ్వగా.. బ్యాంకులు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి.

28 రోజుల తర్వాత బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చేసరికి.. పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరారు. భౌతిక దూరాన్ని మరిచారు. ఖాతాదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఆయా బ్యాంకుల వద్ద అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details