గోదావరి ప్రవాహంతో దేవీపట్నం వరుసగా కొన్ని రోజులుగా ముంపులోనే చిక్కుకుని ఉంది. మండల కేంద్రంతోపాటు 36 గ్రామాలు పూర్తిగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇళ్లన్నీ మునిగిపోయాయి. కొండ కోనల్లో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. పూరిళ్లు రోజులతరబడి నీళ్లలో నాని కూలిపోతున్నాయి. ఆహారం తాగునీటి కోసం జనం అలమటిస్తున్నారు. చీకటిపడితే భయంతో వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరించే పరిస్థితి కనిపించడం లేదు. సోలార్ లైట్లు, టార్చ్‌లైట్లు అధికారులకే అందించలేదు. కొండమొదలు పంచాయితీ పరిధిలోని 14 మారుమూల గ్రామాలకు సహాయకార్యక్రమాలు ఏమాత్రం అందడం లేదు. ప్రమాదకరమైన గోదావరిలో యంత్రాంగం ప్రయాణించలేని దుస్థితిలో ఉంది. ఆహారం, తాగునీరు లేక కొండకోనల్లో గోదావరి జనం విలవిల్లాడిపోతున్నారు. గండి పోశమ్మ ఆలయం వరుసగా నీటిలోనే మునిగిపోయి ఉంది. ఎటుచూసినా వరదనీటితో దుర్భరమైన పరిస్థితుల్లో జనం కాలం వెల్లదీస్తున్నారు. నిత్యావసరాలు, బ్యాటరీ లైట్లు, టార్పాలిన్లు, కిరోసిన్ ఇతర ఆహార పదార్ధాలు సకాలంలో అందించాలని జనం వేడుకుంటున్నారు.
జలదిగ్బంధంలో దేవీపట్నం... ఆదుకోని యంత్రాంగం... - rajamundry
గోదావరి ప్రహావం పరిహవాక ప్రాంతాల ప్రజలను నిద్రపట్టనివ్వడం లేదు. రోజుల తరబడి అర్థాకలి, నిద్రలేని రాత్రుల్లే గడుపుతున్నారు ముంపు ప్రాంతాల జనం.
జలమయమైన దేవీపట్నం