ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనుషుల్నే కాదు.. మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా - పిఠాపురంలో వృద్ధుడు మృతి తాజా వార్తలు

ఓ వృధ్దుడు వైద్యం కోసం వెళ్లి తిరుగు పయనంలో అనారోగ్యం కారణంగా రోడ్డు పక్కనే ప్రాణాలు విడిచాడు. అయితే కరోనా కారణంగా ఎవరూ కూడా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లలేదు సరికదా.. అతనిని అంబులెన్స్​లోకి ఎక్కించడానికి కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకూ ఎస్సై, అంబులెన్స్ డ్రైవర్​ పూనుకొని వృద్ధుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే....

old man dead in pitapuram
రోడ్డు పక్కనే ప్రాణాలు విడిచిన వృద్ధుడు

By

Published : Jun 17, 2020, 12:14 PM IST


కరోనా మహమ్మారి... మనుషుల్నే కాదు మానవత్వాన్ని చంపుతోందని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఓ వృద్ధుడి మృతి సంఘటన రుజువు చేసింది. పట్టణంలోని ఇందిరానగర్​కు చెందిన ప్రసాద్ అనే వృద్దుడు ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తూ కోటమ్మ సెంటర్​లో రాజుగారి విగ్రహం వద్ద కూర్చుని ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. నడి రోడ్డుపై వృద్ధుడు పడి మృతి చెందినా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్సై అబ్దుల్ నబి ఆ వృద్ధుడు వైద్యం చేయించుకున్న చీటీలు, బ్యాంక్ పాస్​బుక్​ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చినా అందులోకి మృతదేహాన్ని ఎక్కించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు అంబులెన్స్ డ్రైవర్​కు ఎస్సై సాయం చేయ్యగా వృద్ధుడి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details