తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు ఘటనా స్థలంతో పాటు నదీ ఒడ్డున గాలింపు ముమ్మరం చేశాయి. తమవారి ఆచూకీ తెలపాలంటూ బోటు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద అధికారులను వేడుకుంటున్నారు. కనీసం మృతదేహాలైనా అప్పగించాలని ప్రాధేయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల బృందంతోపాటు ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ పోలీసు అధికారులతో కలిసి... ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. నదిలో ఇవాళ రెండు మృతదేహాలు లభ్యమైనా ఇవి బోటు ప్రమాదానికి సంబంధించినవి కాదని అధికారులు తేల్చారు. ముంబయి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం నివేదిక తర్వాతే బోటు ఎలా బయటకు తీసేది నిర్ణయించగలమని సంయుక్త కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.
గల్లంతైన బోటు కోసం.. ఐదో రోజూ గాలింపు - officers finding boat accident
గోదావరిలో గల్లంతైన బోటు కోసం అధికారులు ఐదో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమవారి ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. ముంబయి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం నివేదిక వచ్చాకే... బోటును ఎలా బయటకు తీసేది నిర్ణయించగలమని తూర్పు గోదావరి సంయుక్త కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు.
బోటు కోసం గాలింపు