తూర్పుగోదావరి జిల్లా నడకుదురు ప్రాంతం.. నిర్జన ప్రదేశంలో కాలిన మృతదేహం.. అటుగా వెళ్తూ గమనించిన వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేశాడు. కాసేపట్లో.. సైరన్ మోగించుకుంటూ.. పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం ఆధారాల వేటలో ఉంది. జాగిలాలు.. వాసన చూస్తూ మృతదేహం వద్దకు వెళ్లాయి. అక్కడ గుర్తుపట్టలేనంతగా కాలిన మృతదేహం ఉంది.ఎవరిదోకూడా పోలీసులకు అర్థంకాలేదు. ఘటనాస్థలిలో కాల్చిపారేసిన సిగిరెట్లు, మద్యం సీసాలు.. గుర్తించారు. వాటి ఆధారంగా మద్యం మత్తులో ఏదో గొడవ జరిగిందని.. ఆ పెనుగులాటలో హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు.
విచారణ క్రమంలో పోలీసుల ప్రాథమిక అంచనాలు తప్పని తేలింది. ఆ గుర్తుపట్టలేనంతగా కాలిన మృతదేహం రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన సతీష్‌దని.. అతన్ని చంపి తగలబెటట్టింది అర్జవేణి, రాజశ్వరి అనే అక్కాచెల్లెళ్లని.. నిర్థరణైంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలింది. పక్కా పథకం ప్రకారం సురేష్‌ను.. నిర్జన ప్రాంతానికి రప్పించిన అక్కాచెల్లెళ్లు.. దారుణంగా హతమార్చారు.