ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాన్నకు చేతబడి చేస్తారనే.. తల్లిని..అక్కను చంపేశాడు! - ap latest

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్యను పోలీసులు చేధించారు. తండ్రిపై ప్రేమతో కుమారుడే ఈ జంట హత్యలు చేశాడని తెలిసి లోకం విస్తుపోయింది. అసలేం జరిగింది..!

తల్లి కూతుళ్లను చంపేశాడు!

By

Published : Aug 29, 2019, 10:56 PM IST

ఈనెల 25వ తేదీన జరిగిన తల్లీకూతుళ్ల హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తక్కువ వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తల్లి మాధవి, కుమార్తె కరుణలను చంపింది..మాధవి కుమారుడే అని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు.


అసలు కథేంటి..?
శ్రీనివాసరావు, మాధవి దంపతులు. భార్య స్థానిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తలు మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. కుమారుడు విజయ్​తో శ్రీనివాసరావు కాకినాడలో నివాసముంటున్నాడు. శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లికితోడుగా కూతురు కరుణ రామచంద్రపురంలోనే ఉంటోంది. శ్రీనివాసరావు, విజయ్​ అప్పుడప్పుడు రామచంద్రాపురం వచ్చి వెళ్తుంటారు. సాఫీగా సాగిపోయే వీరి జీవితంలో పద్దెనిమిది ఏళ్లు కూడా నిండని కుమారుడే రాక్షసుడయ్యాడు. కిరాతకంగా తల్లిని..అక్కను హతమార్చి..లోకం తలదించుకునేలా చేశాడు.


ఎందుకు హత్య చేశాడు..!
ఆగస్టు 25న జరిగిన ఈ జంటహత్యల్లో విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. భర్త శ్రీనివాసరావు మొదటి భార్యను వదిలేసి వేరే కాపురం పెట్టాడు. రెండో భార్యకు ఓ కూతురు. కుమారుడు విజయ్​ వారితోనే ఉంటున్నాడు.

తండ్రి ఆరోగ్య ఖర్చులకు తల్లి డబ్బులివ్వలేదనే కోపంతో విజయ్​ రగిలిపోయేవాడు. శ్రీనివాసరెడ్డి అనారోగ్య పరిస్థితికి తన తల్లి, అక్క కారణమని నమ్మాడు. వారు 'చేతబడి చేసి నాన్నను చంపేస్తామని' పలుమార్లు అంటుంటే..కక్ష పెంచుకున్నాడు. హతమార్చాలని నిర్ణయించుకుని తండ్రికి ప్రణాళిక వివరించాడు. శ్రీనివాసరెడ్డి మద్దతుతో సమయం కోసం వేచి చూశాడు. వ్యూహంలో భాగంగానే విజయ్​ ఆగస్ట్ 25న యథావిధిగా రామచంద్రపురం వెళ్లాడు. అందరూ నిద్రపోయాక..సుత్తితో తల్లిని 4 సార్లు కొట్టి చంపాడు. అలికిడి విని లేచిన అక్కనూ.. కణికరించలేదు. అదే ఆయుధంతో దాడి చేసి విచక్షణ రహితంగా హత్య చేశాడు. ఆధారాలు తారుమారు చేసి పరారయ్యాడు. ఈ కేసును సవాల్​గా​ తీసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పాడి దర్యాప్తు చేసి... నిందితులను గుర్తించారు. శ్రీనివాసరావు, విజయ్​ని అరెస్టు చేశారు.

తల్లీ కూతుళ్ల హత్య కేసు చేధించిన పోలీసులు

ఇవీ చదవండి.... తల్లీకుమార్తెల హత్య.. డ్రైనేజీలోకి రక్తం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details