ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విషాదం నింపుతున్న ఆదివారం... ఇదే రోజున జల ప్రమాదాలు

By

Published : Sep 16, 2019, 7:30 AM IST

వారంతం విషాదం నింపుతోంది. దేవీపట్నం వద్ద నిన్న జరిగిన బోటు ప్రమాదం సహా గతంలోనూ ఇలాంటి ఘటనలు ఆదివారం రోజునే జరిగాయి.

ఆదివారం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆదివారం కాస్తా విషాదాదివారంగా మారింది. ఈ ఒక్క ఘటనే కాదు.. గతంలో జరిగిన పడవ బోల్తా ఘటనలూ ఆదివారమే జరగడం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం అవగతమవుతోంది.

  • విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం 2017 నవంబర్‌ 12న కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు.
  • 2018 జులైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటంతో 15 మంది మృతి చెందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details