ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం మరింత అవసరం'

కరోనా నివారణ, వ్యాక్సినేషన్​పై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరించారు. కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం మరింత అవసరమని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ నియంత్రణ, టీకా ప్రక్రియ వేగవతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్​లో అధికారులతో చర్చించారు.

వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

By

Published : May 1, 2021, 5:22 PM IST

వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం మరింత అవసరమని... వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అభిప్రాయపడ్డారు. కరోనా నివారణ, టీకా వేయడంపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ నియంత్రణ, టీకా ప్రక్రియ వేగవతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్​లో అధికారులతో చర్చించారు. మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు సుభాష్ చంద్రబోస్, గీత, భరత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఆక్సిజన్ వినియోగం పట్ల కొందరు రోగులకు అవగాహన లేకపోవడంవల్ల 20 శాతం వృథా అవుతున్నట్టు గుర్తించామని మంత్రి చెప్పారు. 104 వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో పడకల సంఖ్య పెంచుతున్నామని, అలాగే రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోనూ కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి నాని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details