' బోరుమన్న తెలుగుదేశం ఎమ్మెల్యే' - east godavari
తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వనుందునే పార్టీ మారుతున్నానని... ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రకటించారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నవెల్లడించారు.
టికెట్ ఇవ్వనందునే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వస్తున్నానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో తన అనుచరులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. వైఎస్ హయాంలో తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చారని... తెలుగుదేశం మాత్రం మోసం చేసిందని ఆరోపించారు. అందుకే కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీ మారక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. త్వరలోనే వైకాపాలో చేరబోతున్నట్టు వెల్లడించారు.