తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన నల్లమిల్లి రామిరెడ్డి కుమారుడు సాయి వెంకటరెడ్డి.. ఈనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను ఆరో తరగతి చదువుతున్నాడు. అప్పటినుంచి విద్యార్థి తండ్రి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం రాత్రి పి. గన్నవరంలో ఒక బాలుడు స్థానికులకు కనిపించటంతో పోలీసులకు అప్పగించారు. ఎస్సై సురేంద్ర అనపర్తి పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరించారు. రామిరెడ్డి కుమారుడిగా గుర్తించి విద్యార్థిని తండ్రికి అప్పగించారు.
తప్పిపోయిన బాలుడిని తండ్రి వద్దకు చేర్చిన పోలీసులు - పందలపాకలో తప్పిపోయిన బాలుడు
తప్పిపోయిన కుమారుడిని పోలీసులు తండ్రికి అప్పగించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో జరిగింది. 3 రోజుల క్రితం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తప్పిపోగా.. నేడు అతడిని తండ్రి ఒడికి చేర్చారు పోలీసులు.
తప్పిపోయిన బాలుడిని తండ్రి వద్దకు చేర్చిన పోలీసులు