తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం మొక్కలతిప్ప గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని మూడేళ్ల బాలుడు ప్రజ్నహర్ష... గత సోమవారం ప్రమాదవశాత్తూ పంట కాలువలో పడి మృతి చెందాడు. ఈ మేరకు సంబంధిత కేంద్రం టీచర్, ఆయాలపై చట్ట పరమైన చర్యలను తీసుకున్నామని స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కానేటి వనిత తెలిపారు. మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలిసి మొక్కలతిప్పైలోని బాలుని ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను... ఇంటి నుంచి తీసుకువచ్చి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు, ఆయాలదేనన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"ఏడవకు తల్లీ...ప్రభుత్వం సాయం అందిస్తుంది" - తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన మండలం మొక్కలతిప్ప గ్రామం
గత సోమవారం పంట కాలువలో పడి మృతి చెందిన మూడేళ్ల ప్రజ్నహర్ష సంఘటనపై మంత్రులు స్పందించారు. నేరుగా బాలుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని మంత్రి కానేటి వనిత హామీ ఇచ్చారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు