అమలాపురం నియోజకవర్గం పరిధిలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్(Minister vishwaroop) వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో ఎన్ఎస్వీబీ వసంతరాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలాపురం నియోజకవర్గంలో వివిధ చమురు సంస్థలు నుంచి సీఎస్ఆర్ నిధుల కింద 10 కోట్ల 9 లక్షల రూపాయలు నిధులు అందుబాటులో ఉన్నాయని.. వీటికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి విశ్వరూప్ అధికారులకు స్పష్టం చేశారు.
Minister vishwaroop: సీఎస్ఆర్ నిధులన్నాయి...పనులు చేపట్టండి! - viswaroop review news
అమలాపురం నియోజకవర్గం పరిధిలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి పినిపే విశ్వరూప్(Minister vishwaroop) ఆదేశించారు.
Minister viswaroop