తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో పలు అభివృద్ధి పనులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శంకుస్థాపన చేశారు. నాలుగో వార్డు గారపాటి వీధీలో రూ.99 లక్షలతో గ్రంథాలయం భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎంతో కాలంగా అద్దె భవనంలో నడుపుతున్న గ్రంథాలయానికి సొంత భవనం ఏర్పాటుకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. అమలాపురం పట్టణ ప్రజల కోరిక మేరకు నల్ల సూర్యచంద్రరావు డిజిటల్ గ్రంథాలయంగా పేరు పెడతామని అన్నారు.
అమలాపురంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
అమలాపురం ప్రజలకు త్వరలోనే అత్యాధునిక సదుపాయాలతో కూడిన గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ప్రజల కోరిక మేరకు నల్ల సూర్యచంద్రరావు డిజిటల్ గ్రంథాలయంగా పేరు పెడతామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో రూ.75 లక్షలతో నిర్మించనున్న ఉప ఖజానా కార్యాలయం భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మనీ, కమిషనర్ వి.అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దెబ్బతిన్న రోడ్లు.. ఇబ్బంది పడుతున్న చోదకులు