ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం పంపిణీ వాహనాలు ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇంటింటికీ బియ్యం పంపిణీ వాహనాలను.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. రాజకీయాలంటే జీవితాలు బాగుచేసేవని ప్రజలకు సీఎం జగన్ నమ్మకం కలిగించారిని కీర్తించారు.

By

Published : Jan 21, 2021, 7:14 PM IST

minister inaugurated rice transport vehicles in kakinada
కాకినాడలో బియ్యం పంపిణీ వాహనాలు ప్రారంభం

పాలకులం కాదు సేవకులమని చెప్పిన సీఎం జగన్.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజకీయాలంటే జీవితాలు బాగుచేసేదని ప్రజలకు నమ్మకం కలిగించారని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇంటింటికీ బియ్యం పంపిణీ కోసం వాహనాలను ప్రారంభించారు. రేషన్‌ సరకులు అందించడానికి 1,076 వాహనాలు ప్రారంభించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.

గతంలో ఎవరూ చేయని గొప్ప కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ లక్షీశలతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details