తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం నిర్మాణ పనులు 90 శాతంపైగా పూర్తైనట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ పనులను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. రథోత్సవానికి నూతన రథం సర్వాంగసుందరంగా తయారవుతుందని స్పష్టం చేశారు.
90శాతం పూర్తైన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం - antarvedi latest news
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 90శాతం పూర్తైన రథం పనులను.. మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. వచ్చే ఏడు స్వామివారి కల్యాణానికి నూతన రథం సిద్ధమవుతోందని మంత్రి స్పష్టం చేశారు.
90శాతం పూర్తైన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం నిర్మాణం