సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాస్మొటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు, పలు కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సత్యదేవుని సేవలో మంత్రి విశ్వరూప్ - rajamahendravaram
అన్నవరం సత్యనారాయణ స్వామిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మంత్రి విశ్వరూప్