Minister Karumuri Venkata Nageswara Rao on Michaung Cyclone: మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలుల వల్ల అనేక చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు వర్షం కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆరుగాలం కష్టించిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలో తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అధైర్యపడొద్దు : మంత్రి కారుమూరి Minister Karumuri Visited Tanuku: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సందర్భంగా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న తణుకు మండలంలోని దువ్వ, అత్తిలి మండలం వరిగేడు గ్రామాల్లో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తడిసిన ధాన్యాన్ని, పంటలను పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
'తుపాను ప్రభావం' ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం - అవస్థలు పడుతున్న రైతన్నలు
Minister Karumuri Comments: ''మిగ్‌జాం తుపానుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. నిన్నటి వరకు నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎక్కడికక్కడ లిఫ్ట్ చేసి, రైస్ మిల్లులకు తరలించే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 5 లక్షల 30 వేల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశాం. లక్షా ఏడు వేల ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో పంపించాం. ఇంకా 10వేల మెట్రిక్ ధాన్యాన్ని గోదాముల్లో భద్రపరచాం. రోడ్డు మీదున్న ఏ గింజను వదలకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ 11 వందల కోట్ల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటికే 880 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇంకా 2వేల కోట్ల రూపాయలు 2వేల మంది రైతుల ఖాతాల్లోకి వేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే వారికి జమం చేస్తాం.'' అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
మిగ్‌జాం ప్రభావంతో కుండపోత వర్షాలు - నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
Minister Karumuri Instructions to Officials Purchase Grain:అనంతరం కోసిన ధాన్యాన్ని మిల్లులకు చేరేలా, మిల్లర్లు త్వరితగతిన అన్‌లోడింగ్ చేసుకునేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులెవ్వరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ధాన్యం సొమ్ము చెల్లించడానికి 21 రోజులు గడువు ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల్లోనే రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షం వల్ల తీర ప్రాంతాల్లోని ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
ఏపీని కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను - స్తంభించిన జనజీవనం, అన్నదాతల్లో ఆందోళన