తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో జోరు వాన కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా...ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.
కోనసీమలో విస్తారంగా వర్షాలు..లోతట్టు ప్రాంతాలు జలమయం - కోనసీమలో భారీ వర్షం
కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కోనసీమలోని పలుప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కోనసీమలో జోరు వాన