ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి కేసులో ఆ ముసుగు వ్యక్తి ఎవరు? - avialable

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు కేసులో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. ఓ ఆగంతకుడు అద్దె కోసం వచ్చినట్లు సీసీ టీవీ ఫుటేజిలో గుర్తించారు. బాలుడి కోసం 7 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

అపహరణకు గురైన మండపేట బాలుడు.. సీసీ ఫుటేజీ లభ్యం

By

Published : Jul 24, 2019, 2:04 PM IST

Updated : Jul 24, 2019, 3:05 PM IST

అపహరణకు గురైన మండపేట బాలుడు.. సీసీ ఫుటేజీ లభ్యం

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మి నగర్​లో అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు కేసులో టెన్షన్​ కొనసాగుతోంది. అపహరణకు గురై రెండు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. బాలుడి కోసం 7 పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. బాలుడి ఇంటి చుట్టుపక్కల సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి ఇంటి సమీపంలోని మరో అపార్టుమెంట్ వద్దకు ఈనెల 3వ తేదీన ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి రావడం సీసీ టీవీలో రికార్డ్​ అయ్యింది. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తిస్తే చిన్నారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులంటున్నారు.

ఆందోళనలో తల్లిదండ్రులు..
కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిండు గర్భిణీగా ఉన్న జషిత్‌ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది.

Last Updated : Jul 24, 2019, 3:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details