తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో స్థానిక లేనోర పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ.. చివరికి మృతి చెందాడు.
స్థానికులు అనుమానం వ్యక్తం చేయగా.. గెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రభాత్ కొవిడ్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు పాస్టర్లు, ముగ్గురు కుటుంబీకులకు పరీక్షలు చేస్తామని డాక్టర్ తెలిపారు.