తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజేంద్రనగర్లో దారుణమైన ఘటన జరిగింది. ఐదు నెలల మృత శిశువును మురుగుకాల్వలో పడేశారు. శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటుందనీ.. ఖననం చేసేందుకు ఆర్థిక స్తోమత లేక ఇలా పడేసి ఉంటారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామనీ.. ఎలాంటి వదంతులను నమ్మొద్దని స్థానికులకు సూచించారు.
దారుణం.. మురుగు కాల్వలో మృత శిశువు - drinage
ఐదు నెలల వయసున్న మృత శిశువును మురుగు కాల్వలో పడేశారు. శిశువును పూడ్చడానికి డబ్బుల్లేక ఈ పని చేశారా ? లేక చంపేసి పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మురుగు కాల్వలో మృతశిశువు.. ఎవరు పడేశారు!