కరోనా మహమ్మారి రాకముందు ఏ దుకాణాలు ఏ కేటగిరికి చెందుతాయి అనే విషయాన్ని ఎవరు అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలంతా దుకాణాల కేటగిరీలు, అవి తెరిచి ఉండే సమయాలను తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
- నిత్యావసర వస్తువుల కేటగిరిలో
కూరగాయలు, వంటింటి, కిరాణా, పాలు అమ్మకాలు సాగించే దుకాణాలు ప్రధానంగా ఉన్నాయి..
- అత్యవసర దుకాణాల కేటగిరిలో
ఇంగ్లీషు మందులు, ఆయుర్వేదం అలోపతి, ఆసుపత్రికి అవసరాలకు అవసరమైన దుకాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇప్పుడు నిత్యావసర వస్తువుల దుకాణాల జాబితాలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలు చేరాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ సమయాల్లో నిబంధనలు సడలించి మరీ వీటికి మినహాయింపు ఇచ్చి అమ్మకాలు సాగించేందుకు అధికారులు ప్రత్యేక జీవోలు జారీ చేశారు.
ప్రజలు నిత్యం ఉదయం వేళలో కాయకూరలు, మాంసాహార దుకాణాలు, కిరాణా షాపుల వద్ద అధిక సంఖ్యలో జనం ఉంటున్నారని... దానివల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఉన్నతాధికారులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.