తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఇందిరానగర్ లో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అర్తమూరుకు చెందిన లక్ష్మీకాంతానికి... సత్తి కృష్ణారెడ్డితో 5సంవత్సరాల క్రితం వివాహమైంది.
కృష్ణా రెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నంగా పొలం, బంగారం ఇచ్చారు. అత్త, భర్త తనను అనుమానిస్తున్నారని... అందంగా లేదంటూ.. కట్నం తీసుకురాలేదంటూ వేధిస్తున్నారని 6 పేజీల లేఖ రాసి నివాసం ఉండే భవనం సన్ సైడ్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి తండ్రి కుమార్తెను చూడటానికి వచ్చే సమయానికి లక్ష్మీ కాంతం ఉరేసుకుని ఉండటాన్ని గమనించి కిందకి దించాడు. అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య - dowry
వరకట్న వేధింపులు తాళలేక అనపర్తిలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వివాహిత ఆత్మహత్య
ఇది కూడా చదవండి.