ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా వ్యాక్సిన్​ విషయంలో వైద్యాధికారుల తప్పు లేదు'

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యవహారం తీవ్ర దుమారం రేగగా ఆ విషయంపై కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పందించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. అందుకే ఇంటివద్ద కొవిడ్ వ్యాక్సిన్​ ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. వైల్ వృథా కాకూడదని తానే టీకా వేయించుకున్నానని చెప్పారు.

mla jaggiredy
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కరోనా టీకా వ్యవహారం వార్తలు

By

Published : Apr 10, 2021, 3:46 PM IST

తాను ఇంటివద్ద కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న విషయంలో వైద్య అధికారుల తప్పు లేదని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యవహారంపై స్పందించారు. తమ కుటుంబ సభ్యులు కొంతమంది మంచానికే పరిమితమైన కారణంగా వైద్యాధికారులకు ఈ విషయాన్ని తెలిపి వ్యాక్సిన్ వేయవలసిందిగా కోరానన్నారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేసేందుకు వైద్యులు నిరాకరించారన్నారు. వైల్ వృథా కాకూడదని ఆ టీకా తాను వేయించుకున్నానన్నారు.

కరోనా వ్యాక్సిన్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని తాను వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను తానే సోషల్ మీడియాలో పత్రికలకు విడుదల చేశానన్నారు. ఈ విషయంలో అధికారుల తప్పులేదని జిల్లా అధికారులకు నివేదించానన్నారు.

ఇదీ చదవండి:కాకినాడ సంయుక్త కలెక్టర్​పై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details