తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వరకు యాభై కిలోమీటర్లు మేర నిర్మించే కోనసీమ రైల్వే నిర్మాణ పనుల్లో.. రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటాపై సందిగ్ధత నెలకొంది. ఈ పనులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం గతంలోనే కేటాయించినా... పనుల్లో జాప్యం జరిగింది.
అనుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ విలువలో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా... వీటిపై సందిగ్దత నెలకొంది. ఫలితంగా.. ప్రస్తుతం జరుగుతున్న పనులు తప్ప కొత్తవి చేపట్టవద్దని రైల్వే శాఖ ఇంజినీర్.. స్థానిక అధికారులకు లేఖ రాశారు.