కథలు సిద్ధంగా ఉన్నాయి.. నిర్మాత కావాలి: కోదండరామిరెడ్డి - director
దాదాపు పదేళ్ల నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న కోదండరామిరెడ్డి... నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు సిద్ధమని చెప్పారు. వ్యక్తిగత పనుల మీద తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
అభిరుచి ఉన్న నిర్మాత ముందుకు వస్తే సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి చెప్పారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తన దగ్గర కథలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ముంగండకి వ్యక్తిగత పనిమీద వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవితో తనకు ఉన్న అనుంబంధాన్ని వివరిచారు. ఇంతవరకు తాను 92 సినిమాలకు దర్శకత్వం చేయగా వాటిలో 27 సినిమాలు చిరంజీవితో చేసినవేనని గుర్తు చేసుకున్నారు. ట్రెండ్ ఏదైనా సినిమాకు కథే మూలమని స్పష్టం చేశారు.