ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో సూక్ష్మ పరిశీలకులకు లెక్కింపు విధులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా లెక్కింపు కేంద్రంలో వ్యవహరించాల్సిన తీరు, నిబంధనల గురించి సూక్ష్మ పరిశీలకులకు వివరించారు. ప్రతి రౌండ్ పూర్తయిన వెంటనే సంబంధిత ఫారం పూర్తి చేసి ఎన్నికల పరిశీలకులతో సంతకం తీసుకోవాలని నిర్దేశించారు. కౌంటింగ్ ఏజెంట్లతో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. లెక్కింపు కేంద్రంలో హడావిడి ఉంటుందని...విధి నిర్వహణలో మాత్రం కచ్చితంగా, పారదర్శకంగా పని చేయాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలి: కార్తికేయ మిశ్రా
"ఓట్ల లెక్కింపు విధుల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకూడదు... విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలి... కౌంటింగ్ ఏజెంట్లతో జాగ్రత్తగా మెలగాలి" అని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూక్ష్మ పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు.
విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలి: కార్తికేయ మిశ్రా