తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వాహనాన్ని బిక్కవోలు మండలం కాపవరం గ్రామస్థులు, వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల్లోని అర్హులకు కాపవరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటిని పరిశీలించి తిరిగి వెళ్తున్న రామకృష్ణా రెడ్డి వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా... ఇప్పుడు తమకు వచ్చే స్థలాలను అడ్డుకుంటున్నారంటూ ఆందోళనకు దిగారు. గతంలో ఏనాడు కాపవరం రాని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు తమ గ్రామానికి వచ్చారంటూ ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న కాపవరం గ్రామస్థులు - మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న కాపవరం గ్రామస్థులు !
పేదల ఇళ్ల స్థలాల పరిశీలనకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వాహనాన్ని కాపవరం గ్రామస్థులు, వైకాపా నాయకులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా... ఇప్పుడు తమకు వచ్చే స్థలాలను అడ్డుకుంటున్నారంటూ ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న బిక్కవోలు ఎస్సై.. ఆందోళనకారులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. రామకృష్ణరెడ్డి కారు దిగి వారికి వివరణ ఇచ్చారు. తాను కేవలం స్థలాలను పరిశీలించేందుకు మాత్రమే వచ్చానని ఎవరికి స్థలాలు రాకుండా అడ్డుకోవటం లేదని స్పష్టం చేశారు. ఏ ఊరి వాళ్లకు ఆ ఊర్లోనే నివేశన స్థలాలు ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు గ్రామస్థులకు వివరించారు. పేదలకు కేటాయించిన స్థలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఈ అంశంపై బిక్కవోలు తహసీల్దారును ప్రశ్నించానని చెప్పారు. తహసీల్దార్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని.. దానిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. శాంతించిన గ్రామస్థులు ఆయన కారుకు అడ్డు తొలిగారు.
TAGGED:
ex mla nallamilli news