రాష్ట్ర ప్రభుత్వం, అన్నవరం దేవస్థానం, తితిదే, దిల్లీలోని ఏపీభవన్ అధికారులు సంయుక్తంగా దేశ రాజధానిలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దిల్లీలోని తితిదే ధ్యాన మందిరంలో అన్నవరం సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. 27న ఉదయం రెండు విడతల్లో వ్రతాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు శాంతి కల్యాణం చేయిస్తారు. 28న ప్రముఖులు, ముఖ్య అధికారులకు మాత్రమే వ్రతాలు నిర్వహించనున్నారు. అన్నవరం దేవస్థానం నుంచి స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, పూజా సామగ్రి తీసుకువెళ్ళనున్నారు. వ్రతాలు చేయించే పురోహితులు, అర్చకులు, అధికారులు అన్నవరం నుంచి దిల్లీ వెళ్లనున్నారు.
27, 28న దిల్లీలో సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం - ap bhavan
ఈనెల 27, 28 తేదీల్లో దిల్లీలోని తితిదే ధ్యాన మందిరంలో.. సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం నిర్వహించనున్నారు.
అన్నవరం