'అభివృద్ధే తెదేపా లక్ష్యం'
అభివృద్ధి, సంక్షేమమే తెదేపా లక్ష్యమని కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెదేపా ప్రభుత్వం పని చేస్తోందని కాకినాడ నగర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని జగన్నాధపురంలో 77 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర పాలిటెక్నికల్ కళాశాలలో వాకింగ్ ట్రాక్, వ్యాయామశాల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రజలు మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.