ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నార్తులకు కడలి బ్రదర్స్ సేవా సమితి అన్నదానం - lockdown

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో జనజీవనం స్తంభించింది. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి తూర్పుగోదావరి జిల్లాలో కడలి బ్రదర్స్ సేవా సమితి సభ్యులు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నార్తులను ఆదుకుంటున్నారు.

kadali brothers doing food donate for poor people
అన్నార్తులకు కడలి బ్రదర్స్ సేవా సమితి అన్నదానం అన్నార్తులకు కడలి బ్రదర్స్ సేవా సమితి అన్నదానం

By

Published : Apr 13, 2020, 5:24 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని పనులు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు కడలి బ్రదర్స్ సేవా సమితి సభ్యులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు గమనించి.. సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో పేదవారికి తాము ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details