ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి ప్రవాహ ఉద్ధృతి తెలిసే.. వెళ్లారా? - బోటు ప్రమాదం

గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రమాద ప్రాంతాలకు వెళ్లటం సురక్షితం కాదని స్థానికులంటున్నారు. ముఖ్యంగా కచ్చులూరు ప్రదేశంలో గోదారమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. బోటు సిబ్బంది.. ఈ విషయం తెలిసినప్పటికి ఎందుకు వెళ్లారో అర్థం కావటం లేదంటున్నారు గ్రామస్తులు.

గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడు వెళ్లొద్దంటున్న స్థానికులు

By

Published : Sep 15, 2019, 11:29 PM IST

Updated : Sep 15, 2019, 11:51 PM IST

గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడు వెళ్లొద్దంటున్న స్థానికులు

గోదావరి వరద గురించి తెలిసిన వారెవ్వరూ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు ప్రాంతానికి వెళ్లరు. ఎందకంటే అక్కడ పడవలు నడపటానికి అనువుగా ఉండే ప్రదేశం కాదు. ఆ ప్రాంతంలో వరద సమయంలో గోదారమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న స్థానికులు సైతం గోదారమ్మ ఉగ్రరూపం దాల్చినప్పుడు లోనికి వెళ్లరు. ఈ విషయం తెలిసీ... వశిష్ఠ బోటు నిర్వాహకులు మాత్రం పర్యటకులను తీసుకెళ్లారు. స్థానికులైన కచ్చులూరు ప్రజలు వెంటనే పడవలు తీసుకుని వెళ్లి ప్రాణాలకు తెగించి 25 మందిని కాపాడగలిగారు. మిగిలిన వారి ప్రాణాలను మాత్రం ఎంత ప్రయత్నించినా రక్షించలేకపోయారు. అసలు గోదారమ్మకు వరద వస్తుందని తెలిసిన వెంటనే ప్రమాద ప్రదేశాలకు వెళ్లకపోటం ఉత్తమమని స్థానికులు చెప్తున్నారు.

Last Updated : Sep 15, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details