ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇసుకపై మంత్రివర్గ నిర్ణయం అమలు సాధ్యం కాదు' - Govt Decision On Sand

ఇసుక విధానంపై మంత్రివర్గ నిర్ణయం అమలు సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

By

Published : Sep 4, 2019, 6:25 PM IST

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ఇసుక విధానంపై మంత్రివర్గ నిర్ణయం అమలు సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. టన్ను ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున ఇస్తామన్నారు... ఈ ధరకు ట్రాక్టర్లు, లారీలు ఇసుక రవాణా చేయగలవా? అని ప్రశ్నించారు. అవగాహన, సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయంలా ఉందన్నారు.

ఇసుకపై తీసుకున్న నిర్ణయం అవినీతిని పోత్సహించేలా ఉందని విమర్శించారు. రవాణా గిట్టుబాటు కాక ఇసుక విధానం అడ్డదారులు తొక్కే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్న జ్యోతుల నెహ్రూ... తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వదంతుల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..కీలక నిర్ణయాలివే..

ABOUT THE AUTHOR

...view details