ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''డ్వాక్రా యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి'' - ysrcp

ఏళ్ల తరబడి ప్రజలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం రోడ్డుకీడ్చిందని డ్వాక్రా యానిమేటర్లు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం తమను విధుల నుంచి తప్పించే యోచనలో ఉందని... అలా చేస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయని వాపోయారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే గోరంట్లను కలిసిన డ్వాక్రా యానిమేటర్లు

By

Published : Aug 8, 2019, 11:23 AM IST

Updated : Aug 8, 2019, 12:48 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే గోరంట్లను కలిసిన డ్వాక్రా యానిమేటర్లు

వైకాపా ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించే యోచనలో ఉందని డ్వాక్రా యానిమేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ప్రజలకు సేవలు అందిస్తున్న తమను రోడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానిమేటర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Last Updated : Aug 8, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details