ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జన సైనికుల రక్తదానం - blood donation

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో రక్త నిల్వలు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు.. రక్తదానం చేశారు.

Janasena leaders donated Blood
రక్తదానం చేసిన జనసైనికులు

By

Published : May 13, 2020, 7:58 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. కొందరికి ప్రసవ సమయంలో రక్తం అవసరమవుతుంది. లాక్ డౌన్, వేసవి కారణంగా రక్త దాతలు తగ్గగా.. రక్త నిధి కేంద్రంలో నిల్వలు సరిపడా లేవు.

చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, రక్త దాతలు రక్త దానం చేస్తున్నారు. మూడు రోజులుగా నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనసైనికులను స్థానికులు ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details