తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని జాతీయ రహదారిపై అర్దరాత్రి అక్రమంగా లారీలు నుంచి ఐరన్ దింపుతుండగా కొందరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా అక్రమంగా ఐరన్‌ను పక్కదారి పట్టిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో నిలిపి ఉంచిన నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమానులు, ఐరన్ యజమానులకు తెలియకుండా డ్రైవర్లు అక్రమంగా ఐరన్ దందా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఘననపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
యజమానులకు తెలియకుండా అక్రమ దందా ! - iron illegal
లారీ యజమానులు, ఐరన్ యజమానులకు తెలియకుండా అక్రమంగా ఐరన్‌ను పక్కదారి పట్టిస్తున్న డ్రైవర్లను తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు జాతీయరహదారిపై పోలీసులు పట్టుకున్నారు.
యజమానులకు తెలియకుండా అక్రమ దందా