తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికిచెందిన పెమ్మాడి శ్రీనివాస్ అతని భార్య వెంకటరమణ మత్స్యకారులు కుటుంబానికి చెందినవారు. తాటాకు ఇంట్లో సోడాబడ్డీ, మిషను కొట్టు పెట్టుకుని జీవనంసాగిస్తున్నారు. శ్రీనివాస్‌కు 50ఏళ్లు నిండటంతో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను కొరకు ఆగస్టు 2018 దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు తిరస్కరించారు. తిరిగి ఈ ఏడాది జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అయినా మంజూరుకాలేదు. రెండు రోజుల క్రితం మండల రెవెన్యూ అధికారులను కలిసి తన సమస్య వివరించారు. అతని పేరుతో ఉన్న ఆధార్ నెంబరుకు 10 ఎకరాలు ఉన్నట్లు చూపడంతో పింఛను మంజూరు కావటంలేదని తేలింది. తన భార్య ఆధార్ నెంబరు పరిశీలించగా మండలంలోని వివిధ పంచాయతీల్లో 44 ఎకరాలు ఉన్నట్లు చూపుతోంది. దీంతో కంగుతిన్న దంపతులు ఆ 54 ఎకరాలభూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు ఇప్పించాలని లేదంటే గడచిన ఏడాదికి గాను పింఛను ఇవ్వాలని కోరుతూ జిల్లాకలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మింగ మెతుకు లేదు... 54 ఎకరాలకు యజమాని అంటా!
వాళ్లు ఉంటున్నది తాటాకు ఇంట్లో .. పెన్షన్‌కోసం ధరఖాస్తు చేసుకుంటే భార్యభర్తలు ఇద్దరికి కలిపి 54 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ విషయం తెలుసుకుని వారు ఆ భూమికి పట్టాపుస్తకాలు అయినా ఇవ్వండి లేదా పింఛను అయినా ఇవ్వండి అంటున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరిజిల్లా కొత్తపాలెం గ్రామంలో జరిగింది.
ఉండేది తాటాకు ఇంట్లో... అధికారుల లెక్కలో 54 ఎకరాలంట!