తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు నిబంధనలు అతిక్రమించి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తీర నియంత్రణ మండలి పరిధిలో ఆక్వా సాగు చేయకూడదు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా సాగు చేసేందుకు ఏర్పాటుచేసిన ఆక్వా చెరువులను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు.
'వ్యవసాయానికి భూమి ఇస్తే..చేపల చెరువులుగా మార్చేశారు' - తూర్పు గోదావరి
అల్లవరం మండలం ఓడలరేవులో రైతులకు వ్యవసాయ సాగు కోసమని ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని నిబంధలకు విరుద్ధంగా చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. అలా మార్చిన చెరువుల్ని తాశీల్దార్ ఎస్. అప్పారావు ధ్వంసం చేయిస్తున్నారు.
అక్రమ చేపల చెరువులు
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం ఓడలరేవులో పలువురు రైతులకు 78 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు నిమిత్తం పట్టాలపై ఇచ్చామని తహసీల్దార్ ఎస్. అప్పారావు తెలిపారు. ఈ భూములు సముద్రతీర నియంత్రణ మండలికి లోపల ఉన్నాయి. అక్రమంగా నిర్మించిన చెరువులు అన్నిటినీ తొలగిస్తామని తాశీల్దార్ వెల్లడించారు.
ఇదీ చదవండి:'రూ.20కోట్ల పెన్షన్లు దారి మళ్లించారా?... దర్యాప్తు చేయండి'