తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే బోటు వెలికితీత పనులు నిలిపివేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం కూడా సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు... ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని వెల్లడించారు. దిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. పర్యటక శాఖ మంత్రి ఫోన్ చేస్తేనే బోటు కదిలిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తాను ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. సీఎం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మంత్రి అవంతి - boat accident
బోటు ప్రమాద ఘటనలో తనకెలాంటి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
అవంతి