తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో... తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు తీర ప్రాంతంలోని 7 మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అమలాపురం సంయుక్త పాలనాధికారి హిమాన్షు కౌశిక్... రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అమలాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, కోనసీమలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు 16 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సేవలను వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అమలాపురం డివిజన్‌లో 70 సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు.
రావులపాలెంలో అత్యధిక వర్షపాతం నమోదు