ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు.. ఇబ్బందుల్లో ప్రజలు - అమలాపురంలో భారీ వర్షాలు

అల్పపీడనం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ నీరు పొంగి ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అమలాపురం డివిజన్​లోని 16 మండలాల్లో వర్షపాతం 2396.40 మిల్లీ మీటర్లుగా నమోదయింది.

heavy-rains-in-east-godavari
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

By

Published : Oct 13, 2020, 5:11 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జిల్లాలోని రహదారులు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో 24 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రముఖ పిల్లారాయ ఆలయంలోకి వర్షం నీరు చేరింది. ధాన్యం మిల్లుల్లోని బియ్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జాగారం చేయవలసి వచ్చింది. మురుగునీటి పారుదల వ్యవస్థ పొంగి పొర్లుతుండటంతో యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా, మున్సిపల్ కమిషనర్ గౌరీశరోజా గ్రామాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

వీధులన్నీ జలమయం...

భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లోని వీధులు చెరువులుగా మారాయి. డ్రైనేజీ నీరు పొంగి ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. శివారు ప్రాంతంలోని కాలనీలన్నీ నీట మునిగాయి.

కోనసీమలో కుండపోత వర్షం

వాయుగుండం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని 16 మండలాల్లో వర్షపాతం 2396.40 మిల్లీ మీటర్లుగా నమోదయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం 165.00, రావులపాలెం 177.80, కొత్తపేట 168.60 ,ఐ. పోలవరం 265.40, ముమ్మిడివరం 173.60,అయినవిల్లి 146.20, పి గన్నవరం 101.20 చొప్పున వర్షం కురిసింది. అంబాజీపేట 128.40, మామిడికుదురు 100.60,రాజోలు 105.00, మలికిపురం 101.80, సఖినేటిపల్లి 104.60,అల్లవరం 119.40, అమలాపురం 195.20, ఉప్పలగుప్తం 115.40,కాట్రేనికోన 228.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి:

జలదిగ్బంధంలో కోనసీమ తిరుపతి

ABOUT THE AUTHOR

...view details