తూ.గో జిల్లాలో భారీ వర్షం.. ఇళ్లలోకి చేరిన నీరు - peddapuram
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవటంతో పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది.
మెట్టలో భారీ వర్షం
తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలోభారీ వర్షం కురిసింది. భారీ ఎత్తున నీరు ఇళ్ళలోకి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దాపురంలో వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రత్తిపాడు మండలంలోని ఉపప్రణాళిక ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షపునీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక కేంద్రం జలమయమైంది. ఏలేశ్వరంలో సరైన మురుగు నీరు వ్యవస్థ లేక వర్షం నీరుతో వీధులన్నీ నిండిపోయాయి.