ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంటుంది. వరద నీటిని అధికారులు సముద్రంలోనికి విడిచిపెడుతున్నారు. ఈరోజు ఉదయం 4లక్షల 70వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడిచిపెట్టారు. దీనితో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి నదిపాయలు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు.
గోదావరి పరవళ్లు.. ధవళేశ్వరం దగ్గర గరిష్ఠస్థాయికి నీటిమట్టం - ధవళేశ్వరం బ్యారేజ్
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. అధికారులు నీటిని సముద్రంలోకి వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పెరిగిన వరదనీటికి పడవలతో రాకపోకలను సాగిస్తున్న ప్రజలు