ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో గల్లంతైన దివ్యాంగుడి మృతదేహం లభ్యం

అందరూ దివ్యాంగులే. సరదాగా గోదావరి ఒడ్డుకు వెళ్లి పడవలో అవతల ఒడ్డుకు బయలుదేరారు. ఇంతలో ఓ స్నేహితుడు నీళ్లలో పడిపోయాడు. అతనిని కాపాడదామని మరొకరు ప్రమాదంలో చిక్కుకున్నారు. రక్షించండీ... అని అరవడానికి మాటలూ రావు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి బాధితులను కాపాడారు. బృందంలోని ఓ యువకుడు నీటిలోనే ప్రాణాలు వదిలాడు. అతడి మృతదేహాన్ని వెలకితీశారు.

హరికృష్ణ(ఫైల్)

By

Published : May 18, 2019, 11:53 AM IST

'మూగ'బోయిన ప్రాణం
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక వద్ద నిన్న గోదావరిలో గల్లంతైన ఓ దివ్యాంగుడి మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది. సీతానగరం మండలంలోని జాలిమూడికి చెందిన సిద్దే కిరణ్ కుమార్.. బొబ్బిల్లంకకు చెందిన మల్లాడి రాజు, గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన బంటుపల్లి హరికృష్ణ, మల్లవరం గ్రామనికి చెందిన సింబోతి భీమరాజు చెవిటి, మూగ యువకులు. 20 సంవత్సరాల వయసు కలిగిన వీరంతా రాజమహేంద్రవరంలోని ప్రియదర్శిని దివ్యాంగుల కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.

కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చినందున ఉదయం11 గంటల సమయంలో బొబ్బిల్లంకలోని గోదావరి ఒడ్డున ఉన్న పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు. వీరిలో బంటుపల్లి హరికృష్ణ తెడ్డు వేసి నడపుతండగా అదుపు తప్పి నదిలో పడిపోయాడు. ఈత రాదని సైగల ద్వారానే పడవలో ఉన్న స్నేహితులకు సంకేతాలిచ్చాడు. ముగ్గురిలో జాలిమూడికి చెందిన సిద్దే కిరణ్ కుమార్​... నదిలోకి దూకి స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్నందున కిరణ్ కూమర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు.

పరిసర ప్రాంతాల్లో కాకుల శ్రీను అనే వ్యక్తి ప్రమాదాన్ని పపిగట్టి కిరణ్ కుమార్​ను రక్షించి పడవలో వేసి ముగ్గురిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే హరికృష్ణ గల్లంతయ్యాడు. నలుగురికి మాటలు రానందున రక్షించండనే ఆర్తనాదాలూ చేయలేని పరిస్థితి. కోరుకొండ సీఐ జీవి వినయ్ మోహన్, సీతానగరం ఎస్ఐ యూవీ శివనాగబాబు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను రప్పించి, వలలు వేసి.. గల్లంతయిన హరికృష్ణ కోసం శుక్రవారం రాత్రి 7 గంటల వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం ఉదయం బొబ్బిలంక వద్ద గోదావరిలో మరోసారి గాలింపు చేపట్టగా బంటుపల్లి హరికృష్ణ మృతదేహం లభ్యమైంది.

ABOUT THE AUTHOR

...view details