తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, చింతలూరులో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గ్రామసభను నిర్వహించింది. గ్రామానికి చెందిన 90 ఎకరాల భూమిలో మైనింగ్ అనుమతులను కోరుతూ కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలనలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఈ సభకు హాజరయ్యి ప్రజాభిప్రాయ సేకరణను జరిపించారు. గ్రామంలోని అధిక శాతం ప్రజలు మైనింగ్‌ను తిరస్కరించారు. ఈ సభలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి, తదితరులు పాల్గొన్నారు.
మైనింగ్ అనుమతుల పరిశీలన కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ
మైనింగ్ అనుమతుల పరిశీలనలో భాగంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీష ఆధ్వర్యంలో.. తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, చింతలూరులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గ్రామసభను నిర్వహించింది. దీన్ని అధిక శాతం ప్రజలు తిరస్కరించారు.
మైనింగ్ అనుమతుల పరిశీలన కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ