ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాపులపై కేసులను ఉపసంహరించుకుంటాం'

చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

దాడిశెట్టి రాజా

By

Published : Jul 13, 2019, 10:11 PM IST

దాడిశెట్టి రాజా

వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్​పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేరేలా మొదటి బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కాకినాడలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాపులకు మొదటి సంవత్సరం 2వేల కోట్లు కేటాయించడంపై ఆ సామాజిక వర్గం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. తుని రైలు దహనం ఘటనలో పెట్టిన కేసులన్నీ తొలగిస్తామన్న హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందన్నారు. ఈ ఘటనపై అవసరమైతే పునర్విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని దాడిశెట్టి రాజా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details